logo

చందనోత్సవ వైఫల్యంపై విచారణ

చందనోత్సవం సందర్భంగా సింహాచలం అప్పన్న ఆలయంలో భక్తులు ఇక్కట్లకు గురైన ఘటనలపై రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌ గురువారం విచారణ నిర్వహించారు.

Published : 02 Jun 2023 03:28 IST

ఆలయంలో విచారణ నిర్వహిస్తున్న అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌

సింహాచలం, న్యూస్‌టుడే: చందనోత్సవం సందర్భంగా సింహాచలం అప్పన్న ఆలయంలో భక్తులు ఇక్కట్లకు గురైన ఘటనలపై రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌ గురువారం విచారణ నిర్వహించారు. నిజరూప దర్శనం రోజున భక్తులు ఎదుర్కొన్న అవస్థలపై విచారణ చేపట్టేందుకు దేవాదాయశాఖ చంద్రకుమార్‌ను నియమించగా... ఆయన దాదాపు నెల రోజుల తర్వాత రావడం గమనార్హం. తొలుత అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం లోపల పలు చోట్ల పరిశీలించారు. ఉత్సవం  రోజున ఏ ప్రాంతాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు భక్తులకు కల్పించిన సౌకర్యాలపైనా ఆరాతీశారు. వీవీఐపీ టికెట్లు ఎన్ని జారీ చేశారు, ఎంత మంది దర్శించుకున్నారో అడిగారు. అలాగే దేవస్థానం ఉద్యోగులు ఎక్కడెక్కడ విధులు నిర్వహించారో పరిశీలించారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. అంతరాలయం దర్శనాలను ఎలా కల్పించారు, అందుకు అనుసరించిన విధానం వంటివి ఆరా తీశారు. అందుకోసం లోపల పనులు చేపట్టడం, ధ్వజస్తంభం వద్ద తోపులాట పరిస్థితులపైనా వివరాలు అడిగారు. ఈవో త్రినాథరావు, దేవస్థానం అధికారులు ఆయనతో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని