logo

‘డీఎస్‌టీ’ సాంకేతిక విజ్ఞాన కేంద్రం ప్రారంభం

గీతం డీమ్డ్‌ వర్సిటీలో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఏర్పాటు చేసిన సాంకేతిక విజ్ఞాన కేంద్రం(జీ-టెక్‌)ను విశాఖఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ శుక్రవారం ప్రారంభించారు.

Published : 03 Jun 2023 03:27 IST

ప్రారంభోత్సవంలో పాల్గొన్న విశాఖ ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌, గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌, తదితరులు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీలో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఏర్పాటు చేసిన సాంకేతిక విజ్ఞాన కేంద్రం(జీ-టెక్‌)ను విశాఖఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక పరిశ్రమలు విద్యాలయాలకు మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, నిరంతర శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యాలయాల్ని అనుసంధానం చేయడానికి డీఎస్‌టీ దీనిని నెలకొల్పింది. ఈ సందర్భంగా అతుల్‌భట్‌ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ రంగంలో డిజిటలైజేషన్‌ ఆటోమేషన్‌లకు ఇతర దేశాలపై  ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారి స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి చేసుకునేందుకు గీతంలోని జీ-టెక్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తితో ఉన్నామన్నారు. డీఎస్‌టీ శాస్త్రవేత్త డాక్టర్‌ పి.కృష్ణకాంత్‌ మాట్లాడుతూ భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ఇప్పటివరకు దేశంలోని 22 విశ్వవిద్యాలయాల్లో టెక్నాలజీ ఎనేబిలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసిందన్నారు. గీతంలో రూ.3.28 కోట్లతో ఏర్పాటైన జీ-టెక్‌ విజ్ఞాన కేంద్రంలో గీతంతో పాటు ఏపీలోని పలు విద్యా సంస్థల్ని భాగస్వామ్యం చేసే విధంగా పని చేస్తుందన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌, వీసీ ఆచార్య దయానంద సిద్దవట్టం కూడా మాట్లాడారు. గీతం కార్యదర్శి ఎం.భరధ్వాజ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య డి.గుణశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని