logo

రోగులను ప్రైవేటుకు తరలిస్తే కఠిన చర్యలు

కేజీహెచ్‌కు వచ్చే రోగులను ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లకు తరలిస్తే కఠిన చర్యలు తప్పబోవని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. ఆయా క్లినిక్‌ల గుర్తింపును రద్దు చేయడంతో పాటు సంబంధిత వైద్యులు,

Published : 03 Jun 2023 03:27 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, వైద్యాధికారులు రాధాకృష్ణ, బుచ్చిరాజు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు వచ్చే రోగులను ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లకు తరలిస్తే కఠిన చర్యలు తప్పబోవని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. ఆయా క్లినిక్‌ల గుర్తింపును రద్దు చేయడంతో పాటు సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్యులు పూర్తిస్థాయిలో కేజీహెచ్‌లో సేవలందించాలని, విభాగాధిపతులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విభాగాధిపతులు హార్ట్‌ లంగ్‌ మిషన్‌ పనిచేయకపోవడం, న్యూరాలజీ వార్డులో ఎన్‌సీవీ, ఈఈజీ యంత్రాలు మొరాయించిన అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పరికరాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

* గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును ఆసుపత్రి ఇన్‌ఛార్జి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ డి.రాధాకృష్ణ వివరించారు. అనంతరం ఆసుపత్రిలో 15 అభివృద్ధి పనులకు రూ.1.10 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ.కోటి కలెక్టర్‌ మంజూరు చేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడారు. సమావేశం తర్వాత కలెక్టర్‌కు ఆసుపత్రి నర్సింగ్‌ సిబ్బంది శాలువా కప్పి సత్కరించారు. సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ డీఏ నాయుడు, కమిటీ సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని