logo

జులై 2న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం

ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జులై 2న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 03 Jun 2023 03:27 IST

గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై చర్చిస్తున్న ఈవో త్రినాథరావు, అధికారులు, ట్రస్టీలు

సింహాచలం, న్యూస్‌టుడే: ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జులై 2న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో శుక్రవారం సింహగిరిపై అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులతో ఏర్పాట్లపై సమావేశం జరిగింది. జులై 2న గిరి ప్రదక్షిణ, 3న ఆషాఢ పౌర్ణమి నాడు అప్పన్న స్వామికి చివరి విడత చందన సమర్పణ జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్న అంచనాలతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై చర్చించారు. సింహగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ భక్తులకు స్టాళ్లు ఏర్పాటు చేసి అందాల్సిన సేవల కోసం స్వచ్ఛంద సేవకులకు ఆహ్వానించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయం, క్యూలైన్ల నిర్వహణ, తదితర అంశాలపై ట్రస్టుబోర్డు సభ్యులు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సుజాత, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈవోలు వై.శ్రీనివాసరావు, ఎన్‌.ఆనంద్‌కుమార్‌, నరసింహరాజు, జంగం శ్రీనివాస్‌, ట్రస్టీలు గంట్ల శ్రీనుబాబు, శ్రీదేవి వర్మ, సాయినిర్మల, రాజేశ్వరి, రాధ, రామలక్ష్మీ, దొడ్డి రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు