logo

పూడిమడకలో వింత పాములు

పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం వింతపాములు ప్రత్యక్షమయ్యాయి. మత్స్యకార నాయకుడు మేరుగు ప్రవీణ్‌కుమార్‌ వీటి ఫొటోలు, వీడియోలు మత్స్యశాఖ అధికారులు పంపించారు.

Published : 03 Jun 2023 03:32 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడక ఉప్పుటేరులో శుక్రవారం వింతపాములు ప్రత్యక్షమయ్యాయి. మత్స్యకార నాయకుడు మేరుగు ప్రవీణ్‌కుమార్‌ వీటి ఫొటోలు, వీడియోలు మత్స్యశాఖ అధికారులు పంపించారు. ఇక్కడి అధికారులు వీటిపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి లక్ష్మణరావు మాట్లాడారు. వీటిని సిసిలియన్ల జాతికి చెందినవిగా గుర్తించామన్నారు. నీటిలోనూ, మెత్తటి భూమిపైనా జీవించే ఇవి ఉష్ణ మండల సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నారు. వీటికి తలా, తోక ఎటువైపు ఉన్నాయో? తెలుసుకోవడం కష్టమన్నారు.  ఆహారంగా తీసుకోవడానికి పనికిరావని,  ఇవి నదులు, సముద్రాలు కలిచేచోట నేల వదులుగా ఉండే ప్రాంతాల్లో ఆకుచెత్త, చిన్నచిన్న కప్పలు, పురుగులను ఆహారంగా తీసుకొంటాయన్నారు. వీటి నోట్లో డజన్ల కొద్ది సూదిలాంటి పదునైన దంతాలు ఉంటాయన్నారు. ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి వీటి చర్మానికి ఉన్న గ్రంధుల ద్వారా విషాన్ని విడుదల చేసి కాపాడుకుంటాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 రకాలైన సిసిలియన్లు రకాలు ఉన్నాయని  వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని