logo

పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా... అది ప్రమాదకరంగా మారుతుంది.

Updated : 05 Jun 2023 03:54 IST

* వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా... అది ప్రమాదకరంగా మారుతుంది.

* సెలవులు కావడంతో చాలా మంది పిల్లలు ఆటల్లో మునిగి తేలుతుంటారు. సమయానికి నీళ్లు, ఆహారం కూడా సక్రమంగా తీసుకోరు. తల్లిదండ్రులు ఇవన్నీ గమనిస్తూ పిల్లలకు వేళకు ఆహారం, పానీయాలు అందించాలి. అడగకపోయినా వారితో ఎప్పటికప్పుడు నీళ్లు తాగిస్తుండాలి.

* చెమటకు శరీరంలోని లవణాలన్నీ బయటకు పోతుంటాయి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు(ఇంట్లో తయారు చేసుకునేవి), రాగి జావ, సబ్జా గింజల నీళ్లు, మజ్జిగ లాంటివి ఇస్తూ ఉండాలి.

* వదులుగా ఉన్న కాటన్‌, లేత వర్ణాల దుస్తులు వేయాలి.

* ఉదయం 8 లోపు సాయంత్రం 5 గంటల తర్వాతే ఆటలకు పంపించాలి.

* కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌క్రీములు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్‌, మిఠాయిలు వంటి వాటికి దూరంగా ఉంచడం అవసరం. వాటికి బదులుగా తాజా ఆకుకూరలు, పెరుగు, తాజా పండ్లు, సలాడ్స్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. అత్యవసరమైతే పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు గొడుగు, టోపీˆ, చలువ అద్దాలు ధరింపజేయాలి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని