logo

ఈ పండ్లు.. పోషకాలు మెండు

వేసవిలో కేవలం నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల నీటితోపాటు ఇతర పోషకాలు అందుతాయి.

Published : 06 Jun 2023 04:30 IST

వేసవిలో కేవలం నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల నీటితోపాటు ఇతర పోషకాలు అందుతాయి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ: ఇందులో ఉండే విటమిన్‌ సి, ఏ, బీ6 జీవక్రియలో కీలకం. ఎండలో బాగా తిరిగి దాహం వేసినప్పుడు నీళ్లకు బదులు  పుచ్చకాయ ముక్కలు తింటే శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తుంది. వడదెబ్బ తగలకుండా ఇది కాపాడుతుంది.

తాటిముంజలు: అధిక ఉష్ణోగ్రతల నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. తాటి ముంజల్లో ఉండే కాల్షియం, ఐరన్‌, జింక్‌, రాగి, మెగ్నీషియం, సెలీనియం తదితర సూక్ష్మ పోషకాలు శరీరంలో ఉండే నీటి శాతం తగ్గకుండా చూస్తాయి.  

దానిమ్మ: ఐరన్‌ అధికంగా ఉండే దానిమ్మ దేహంలో నీటిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పి, జీర్ణ           సమస్యలను నయం చేస్తుంది.

ద్రాక్ష: ఇందులో ఎక్కువ శాతం పొటాషియం ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.

కీర దోస: రోజూ ఒక కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. మధుమేహం ఉన్న వాళ్లు తింటే షుగర్‌ స్థాయులు సమతుల్యంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను కాపాడుతుంది.

నీటి శాతం ఎక్కువ ఉండే కూరలు: పండ్లే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే దోస, బీర లాంటి కూరగాయలతోపాటు కొత్తిమీర, పుదీనా ఆకులతో చేసిన చట్నీలు ఇతర ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్‌ వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.

ఈనాడు, హైదరాబాద్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని