10లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రవి పిలుపునిచ్చారు. శంకరం బొజ్జన్న కొండ వద్ద సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ మిలియన్ సంకల్ప్, పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ రవి, ఎంపీ సత్యవతి, డీఎఫ్‌ఓ లక్ష్మణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు
అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రవి పిలుపునిచ్చారు. శంకరం బొజ్జన్న కొండ వద్ద సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ మిలియన్ సంకల్ప్, పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారి నుంచి గ్రామ అధికారి వరకు అందరూ తమ వంతుగా మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు. జిల్లాలో జులై 31 వరకు గ్రీన్ మిలియన్ సంకల్పంతో పదిలక్షల మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు యంత్రాంగం తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించాలని, భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమన్నారు. అందరూ నార సంచులు వినియోగించాలని సూచించారు. బొజ్జన్నకొండ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందన్నారు. అనంతరం అందరూ కలసి కొండ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అసిస్టెంట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్, డీఆర్వో వెంకటరమణ, డీఎఫ్‌ఓ లక్ష్మణ్, డ్వామా పీడీ సందీప్, డీపీఓ శిరీషారాణి పాల్గొన్నారు.
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. అదనపు ఎస్పీలు విజయభాస్కర్ (పరిపాలన), సత్యనారాయణ (క్రైం), సీఐలు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు