logo

పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ, కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు.

Published : 06 Jun 2023 05:08 IST

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

సాగర్‌నగర్‌, ఎండాడ, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ, కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ అటవీశాఖ (విశాఖపట్నం డివిజన్‌) ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల సంయుక్తంగా ‘మీట్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అనే కార్యక్రమాన్ని రుషికొండ సమీప ఓ రిసార్ట్‌లో సోమవారం నిర్వహించాయి. కలెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణానికి దోహదపడే ముఖ్యాంశాల్ని వివరించారు. జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, డీఎఫ్‌వో అనంత్‌ శంకర్‌, జూ క్యూరేటర్‌ నందని సలారియా, అదనపు సెంట్రల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవికిరణ్‌, వీపీటీ, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా మాట్లాడారు. పర్యావరణ సమస్యలపై పలు కోణాల్లో చర్చించడం, పర్యావరణ పరిరక్షణ మెరుగుదల దిశగా సంస్థలు, వ్యక్తులు ఎలా పనిచేయాలో తెలుసుకునేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అంకిత భావంతో విశేష సేవలందించిన వివిధ సంస్థలు, విభాగాల ప్రతినిధులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. సత్కార గ్రహీతలు సంజయ్‌ వాసుదేవన్‌, సంజయ్‌కుమార్‌ సిన్హా, డాక్టర్‌ ఎం.రామమూర్తి, వై.అప్పలరెడ్డి, అమర్‌నాథ్‌, మసేను, ధృతిమాన్‌ ముఖర్జీ తదితరులు తమ అనుభవాల్ని తెలియజేశారు.

ఏర్పాటు చేసిన జంతువుల ఛాయాచిత్ర ప్రదర్శన  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని