ఉక్కపోతతో విలవిల
అద్దె భవనాలకు ఏటా అద్దె రూపంలో రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఇరుకు గదులతో గాలి, వెలుతురు అందడం లేదు. తక్కువ అద్దె చెల్లిస్తుండంతో విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ ఫ్యాన్లు వేయవద్దని, విద్యుత్తును ఎక్కువగా వాడవద్దని ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అవస్థలు
రావికమతం (చోడవరం), న్యూస్‌టుడే
అద్దె భవనాలకు ఏటా అద్దె రూపంలో రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఇరుకు గదులతో గాలి, వెలుతురు అందడం లేదు. తక్కువ అద్దె చెల్లిస్తుండంతో విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ ఫ్యాన్లు వేయవద్దని, విద్యుత్తును ఎక్కువగా వాడవద్దని ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీంతో చిన్నారులను వరండాల్లో కూర్చోబెడుతున్నారు.
ఈ ఏడాది వేసవిలో మునుపెన్నడూ లేనంతగా ఎండలు మండుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, ఉన్నచోట బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచి ఫ్యాన్లు తిరగడం లేదు. సామాజిక భవనాలు, అద్దె ఇళ్లలో గాలి, వెలుతురు సరిగ్గా అందక చిన్నారులు విలవిల్లాడుతున్నారు.
* రావికమతం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 234 కేంద్రాలున్నాయి. నెలకు రూ.1.2 లక్షల వరకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. 2019 నుంచి కార్యకర్తలు బిల్లులు చెల్లిస్తున్నారు. 2021 జనవరి నుంచి ప్రభుత్వం కార్యకర్తలకు విద్యుత్తు బిల్లుల డబ్బులు ఇవ్వడం లేదు. నెల నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించి రసీదులు ఐసీడీఎస్ కార్యాలయంలో ఇస్తున్నా.. బిల్లులు పెట్టడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. రావికమతం ఐసీడీఎస్ ప్రాజెక్టులోనే 25 నెలలుగా సుమారు రూ.25 లక్షల వరకు విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
శిథిలావస్థలో అంగన్‌వాడీ భవనం
* జిల్లాలో పది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. వాటి పరిధిలో 1,903 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు సుమారు 47 వేల మంది, మూడేళ్లుపైబడి ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు 22,659 మంది, గర్భిణులు, బాలింతలు 9,963 మంది వరకు ఉన్నారు.
* సొంత భవనాల్లో నడుస్తున్న అన్ని కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. గతంలో పంచాయతీ నిధులతో బిల్లులు చెల్లించే వారు. కొన్నేళ్లుగా విద్యుత్తు బిల్లులు చెల్లించలేమని పంచాయతీలు చేతులెత్తేశాయి.
* 2019 నుంచి బిల్లుల చెల్లింపు భారం అంగన్‌వాడీ కార్యకర్తలపై పడింది. కేటగిరి-2 మీటర్లు కావడంతో నెలనెలా రూ.350 వరకు బిల్లులు వస్తున్నాయి. ఒకవేళ కార్యకర్తలు చెల్లించినా ప్రభుత్వం తిరిగి వారికి చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
1903 కేంద్రాల్లో 850 చోట్ల సొంత భవనాలున్నాయి. 417 కేంద్రాలు సామాజిక, ప్రభుత్వ భవనాల్లో, 641 కేంద్రాలు అద్దె ఇళ్లలో నడుస్తున్నాయి.
గర్నికంలో అద్దె ఇంట్లో..
సదుపాయాలపై సర్వే చేయిస్తున్నాం
జి.ఉషారాణి, పీడీ, ఐసీడీఎస్
అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా వరకు విద్యుత్తు సదుపాయం ఉంది. బిల్లులు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలు చెల్లించకుంటే కార్యకర్తలు ఆ బాధ్యత తీసుకుని బిల్లు పెడితే చెల్లిస్తున్నాం. కేంద్రాల్లో సౌకర్యాలపై సచివాలయ సంక్షేమ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సంయుక్తంగా సర్వే చేయిస్తున్నాం. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Dravid: వాళ్లెందుకు బౌలింగ్ చేయరంటే.. కారణం చెప్పిన ద్రవిడ్
-
Balakrishna: నా వైపు వేలు చూపుతూ.. రెచ్చగొట్టారు: తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ
-
Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం
-
తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా రాళ్ల దాడి
-
TRT: టీఆర్టీ సిలబస్లో స్వల్ప మార్పు
-
Hyderabad: సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు సహా ముగ్గురు పోలీసులపై కేసు