logo

చంద్రబాబుపై ఇంటర్మీడియట్‌ విద్యార్థి వీరాభిమానం

సినిమా హీరోలకు, రాజకీయ నేతలకు అభిమానులు ఉండటం సర్వసాధారణమే. పాలాభిషేకాలు, గజమాలలు, ఫ్లెక్సీలు లాంటి ఎన్నో పద్ధతుల్లో నేతలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు.

Published : 07 Jun 2023 05:16 IST

ఛాతిపై బొమ్మతో పచ్చబొట్టు వేయించుకున్న విశాఖకు చెందిన కిరణ్‌

పచ్చబొట్టు వేయించుకున్న విద్యార్థి కిరణ్‌తో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

ఈనాడు-అమరావతి: సినిమా హీరోలకు, రాజకీయ నేతలకు అభిమానులు ఉండటం సర్వసాధారణమే. పాలాభిషేకాలు, గజమాలలు, ఫ్లెక్సీలు లాంటి ఎన్నో పద్ధతుల్లో నేతలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. విశాఖలోని మధురవాడ వాంబే కాలనీకి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి శ్రావణ్‌ తన ఛాతిపై చంద్రబాబు బొమ్మతో పచ్చబొట్టు వేయించుకొని వీరాభిమానాన్ని చాటుకున్నారు. ‘రాజకీయ రంగంలో అభిమానులు ఛాతిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఒక్క చంద్రబాబుకే ఉంటారు. దటీజ్‌ చంద్రబాబు’ అని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ట్వీట్‌ చేశారు. ఛాతిపై చంద్రబాబు బొమ్మతో పచ్చబొట్టు వేయించుకున్న శ్రావణ్‌ తనను కలిసిన ఫొటోను కూడా గంటా తన ట్వీట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని