logo

అదే జోరు.. అదే ఉత్కంఠ

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీవీజీ.రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో జరుగుతున్న ఉమెన్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ మంగళవారం ఉత్కంఠగా సాగింది.

Published : 07 Jun 2023 05:16 IST

సత్తాచాటిన విజయనగరం రాయల్స్‌ క్రీడాకారిణి పద్మజ

విజయనగరం క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీవీజీ.రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో జరుగుతున్న ఉమెన్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ మంగళవారం ఉత్కంఠగా సాగింది.

* ఉదయం వైజాగ్‌ డాల్ఫిన్స్‌, రాయలసీమ క్వీన్స్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన క్వీన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌ చేసిన డాల్ఫిన్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేశారు. రాయలసీమ క్రీడాకారిణులు సైతం రాణించి ఆరు వికెట్లకు 163 పరుగులతో సమానంగా నిలిచారు. దీంతో సూపర్‌ ఓవర్‌కు వెళ్లారు. ఇందులో క్వీన్స్‌ 18 పరుగులు చేయగా.. డాల్ఫిన్స్‌ చివరి బంతికి ఫోర్‌ కొట్టి 21 పరుగులతో విజయాన్ని అందుకున్నారు.

* మధ్యాహ్నం మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెజవాడ బ్లేజర్స్‌ జట్టు బ్యాటింగ్‌ చేపట్టి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన విజయనగరం రాయల్స్‌ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ జట్టులో 29 పరుగులు చేసిన పద్మజ.. గెలుపులో కీలకపాత్ర పోషించింది.

విజయం అనంతరం సందడి చేస్తున్న వైజాగ్‌ డాల్ఫిన్స్‌ జట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని