logo

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు

ముడసర్లోవ తాగునీటి శుద్ధి కేంద్రం విషయంలో జీవీఎంసీ చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంగళవారం నిరసన తెలిపారు.

Published : 07 Jun 2023 05:16 IST

నీటిశుద్ధిపై ఎమ్మెల్యే వెలగపూడి నిరసన

నీటి శుద్ధి జరుగుతున్న తీరు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, తెదేపా నాయకులు

ఆరిలోవ, న్యూస్‌టుడే: ముడసర్లోవ తాగునీటి శుద్ధి కేంద్రం విషయంలో జీవీఎంసీ చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంగళవారం నిరసన తెలిపారు. స్వయంగా విలేకరులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ శుద్ధి జరుగుతున్న తీరును చూపించారు. ఈ కేంద్రం నుంచి సరఫరా అవుతున్న తాగునీరు రెండు వార్డుల ప్రజలకు అందుతుందని, అయితే ఇక్కడ జరుగుతున్న నీటి శుద్ధి తీరు చూస్తే ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఉందన్నారు. పురాతన పద్ధతిలోనే నీటిశుద్ధి జరుగుతుందన్నారు. బ్రిటీష్‌ వారి కాలంలో నిర్మించిన నీటి శుద్ధి గ్యాలరీ పూర్తిగా పాడైందన్నారు. రిజర్వాయరులో సమృద్ధిగా నీరు ఉన్నా ప్రజలకు తగినంత నీరు అందివ్వలేకపోతున్నారని విమర్శించారు.  తెదేపా హయాంలో రూ. 80 లక్షలతో ఈ ప్రక్రియను అభివృద్ధి చేశామన్నారు. అయితే ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిందన్నారు. దీనిపై మేయర్‌, కమిషనర్‌ దృష్టిపెట్టాలని కోరారు.  కార్యక్రమంలో 10వ వార్డు కార్పొరేటర్‌ మద్దిల రామలక్ష్మి, తెదేపా పార్లమెంటరీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఒమ్మి పోలారావు, తెదేపా వార్డు అధ్యక్షులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని