logo

వైభవంగా మోదకొండమ్మ జాతర

మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ప్రధాన ఆలయం, సతకంపట్టు వద్ద ఘటాల సమర్పణకు భారీగా తరలివచ్చారు.

Published : 07 Jun 2023 05:16 IST

అమ్మవారిని దర్శించుకుంటున్న రాజమాత మయాంక కుమారి

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ప్రధాన ఆలయం, సతకంపట్టు వద్ద ఘటాల సమర్పణకు భారీగా తరలివచ్చారు. మాడుగుల రాజమాత మయాంక కుమారి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీపీ రామధర్మజ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన కూడళ్లలో శ్రీనాధు శ్రీనివాసరావు వాసవీ వనితాక్లబ్‌, కొట్టేడ రమేష్‌, శివయ్య ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. విశాఖ డెయిరీ, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ట్యాంకర్లతో నీరు సరఫరా చేశారు. రామా మెడికల్స్‌ వద్ద విజయవాడ గ్లుకోవిటా సంస్థ ప్రతినిధి ఎ.ఎస్‌.ఎన్‌.వెంకటేశ్వరరావు, సిబ్బంది భక్తులకు ఉచితంగా పానీయాలు అందించారు. జానపద న్యత్య ప్రదర్శనలు, కేరళ మహిళల డ్రమ్స్‌ వాయిద్యం, హనుమాన్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.



అమ్మవారికి ఘటాలు సమర్పిస్తున్న మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని