logo

నేలకొరిగిన చెట్లు.. నిలిచిన విద్యుత్తు సరఫరా

ఎలమంచిలి, కశింకోట మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.

Published : 07 Jun 2023 05:16 IST

తిమ్మరాజుపేటలో రోడ్డుకు అడ్డంగా కూలిన కొబ్బరి చెట్టు

ఎలమంచిలి, కశింకోట, న్యూస్‌టుడే: ఎలమంచిలి, కశింకోట మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలమంచిలి తులసీనగర్‌లో రెండు విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంతా అంధకారంగా మారింది. పిడుగుపాటుతో పలుచోట్ల టీవీలు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. మామిడి పంటకు అపారనష్టం జరిగింది. కశింకోట మండలం నూతనగుంటపాలెం, అచ్యుతాపురం, త్రిపురవానిపాలెం, గొబ్బూరు, నర్సింగబిల్లి తదితర గ్రామాల్లో వడగళ్లతో వర్షం కురిసింది. గాలుల ధాటికి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు వాహనాలు ఆపి సమీపంలోని దుకాణాల వద్దకు పరుగులు తీశారు. విద్యుత్తు తీగలు తెగిపడటంతో నర్సింగబిల్లి ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

అచ్యుతాపురం, రాంబిల్లి: రాంబిల్లి మండలం పలుచోట్ల చెట్లుపడి విద్యుత్తు తీగలు తెగిపోయాయి. రాంబిల్లి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని కొత్తపేట, లాలంకోడూరు ఫీడర్ల పరిధిలో సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. ఆంజనేయుని ఆలయం వద్ద రోడ్డుమీద చెట్టు కూలడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని