logo

కానిస్టేబుళ్లకు స్థాన చలనం

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు బదిలీలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈసారి పూర్తి చేశారు.

Updated : 08 Jun 2023 06:18 IST

సీపీ పర్యవేక్షణలో వెబ్‌ కౌన్సెలింగ్‌

బదిలీల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు బదిలీలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈసారి పూర్తి చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్లలో ఖాళీల వివరాలను స్క్రీన్‌పై ప్రదర్శించారు. అనంతరం జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిబంధనల ప్రకారం బదిలీలు జరిపారు. నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న స్టేషన్లకు నియమించారు.
* అనారోగ్యం, స్పౌజ్‌, ప్రత్యేక అవసరాల కోటా కేసుల్లో మాత్రమే పోలీసు సిబ్బంది అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు. బుధవారం నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 5 సబ్‌ డివిజన్ల పరిధిలో 679 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేశారు. సీపీ పర్యవేక్షణలో వెబ్‌ కౌన్సెలింగ్‌ (జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌) జరిపారు. బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనరేట్‌ సమావేశమందిరంలో సీపీ త్రివిక్రమవర్మ, డీసీపీ(క్రైమ్‌) నాగన్న, ఏడీసీపీ(పరిపాలన), ఏడీసీపీ(ఎస్‌బీ) నాగేంద్రుడు తదితరులు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని