logo

ముగిసిన మోదకొండమ్మ జాతర

మాడుగుల మోదకొండమ్మ జాతర బుధవారం వేకువజాముతో ముగిసింది. సతకంపట్టులోని ఘటాలను ఊరేగించారు. ఈ సందర్భంగా వివిధ వేషధారణలు, విన్యాసాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Published : 08 Jun 2023 03:27 IST

అమ్మవారి చెంత బుద్ధ, కుమార్‌, తాతయ్యబాబు

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల మోదకొండమ్మ జాతర బుధవారం వేకువజాముతో ముగిసింది. సతకంపట్టులోని ఘటాలను ఊరేగించారు. ఈ సందర్భంగా వివిధ వేషధారణలు, విన్యాసాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కోట ప్రాంగణంలో బాణసంచా కాల్పులు అబ్బురపరిచాయి. అన్ని వీధుల్లో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ నృత్యాలు, మహారాజాకోటలో భక్త ప్రహ్లాద నాటక ప్రదర్శన జరిగింది. తెదేపా నాయకులు బుద్ధ నాగజగదీశ్వరావు, పీవీజీ కుమార్‌, బత్తుల తాతయ్యబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, పైడినాయుడు, ఎంపీపీ రామధర్మజ తదితరులు భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. సర్పంచి కళావతి, ఉప సర్పంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బుధవారం మాడుగుల బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

కేరళ మహిళల వాయిద్యం...

బండ్ల వేషాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని