logo

తెదేపాతోనే రాష్ట్ర భవిత: పీలా

తెదేపా విడుదల చేసిన తొలి మ్యానిఫెస్టోలోని అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కోరారు.

Published : 08 Jun 2023 03:27 IST

గోడపత్రికను విడుదల చేస్తున్న పీలా

అనకాపల్లి, న్యూస్‌టుడే: తెదేపా విడుదల చేసిన తొలి మ్యానిఫెస్టోలోని అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కోరారు. బుధవారం నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళ, యువత, విద్యార్థి ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరే విధంగా మ్యానిఫెస్టో ఉందన్నారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అందుకే రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్‌లు ఎక్కడికి వెళ్లినా జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. పార్టీ పరిశీలకులు బొర్రా నాగరాజు, నాయకులు మాదంశెట్టి నీలిబాబు, మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకె జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి, పచ్చికూరి రాము, పోలారపు త్రినాథ్‌, బొద్దపు ప్రసాద్‌, ఆళ్ల రామచంద్రరావు, కొణతాల రత్నకుమారి, సబ్బవరపు గణేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని