రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలా?
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశంలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి ప్రతిపాదించిన మూడు అంశాలు వాయిదా వేయగా, మిగతావన్నీ ఆమోదం పొందాయి.
‘స్థాయీ’ సమావేశంలో ఉద్యోగుల సర్వీసు అంశాల వాయిదాపై అంతటా చర్చ
స్థాయీ సమావేశంలో ఛైర్‌పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి, సభ్యులు
కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశంలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి ప్రతిపాదించిన మూడు అంశాలు వాయిదా వేయగా, మిగతావన్నీ ఆమోదం పొందాయి. గురువారం స్థాయీ సంఘ ఛైర్‌పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సమావేశంలో సభ్యులు 24 అంశాలపై చర్చించారు. జీవీఎంసీలో సర్వీసు క్రమబద్ధీకరణకు ఉన్న నిబంధనల ప్రకారమే అర్హులైనవారి జాబితాను ప్రతిపాదనలు రూపొందించారంటున్నా..సభ్యులు అడ్డుకోవడం వెనుక గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అర్హత పొందినవారు స్థాయీ సభ్యులను సంప్రదించలేదన్న కారణంతోనే వాయిదా పడినట్లు చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని క్రమబద్ధీకరించాలని, ప్రస్తుతం వాయిదా వేయాలని పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఉద్యోగోన్నతులు, క్రమబద్ధీకరణను అనుమతించిన స్థాయీ సభ్యులు, కొత్తగా ప్రభుత్వం అనుమతి కోరడం ఏమిటో అంటున్నారు.
* జి-20 సమావేశాలు, చందనోత్సవంలో అదనంగా పారిశుద్ధ్య కార్మికులను వినియోగించగా, వారికి అవసరమైన నిధులు ఇవ్వడానికి సభ్యులు అంగీకరించారు.
* 49వ వార్డులో నెల రోజుల పాటు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు నాలుగు వాహనాల్ని రూ.3.78లక్షలతో నామినేషన్ పద్ధతిలో నడిపేందుకు అనుమతిచ్చారు. జీవీఎంసీలో పనిచేస్తున్న పొరుగుసేవల కార్మికులకు ప్రధానమంత్రి బీమా చెల్లించేందుకు అనుమతి కోరారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ నిర్వహణ చెల్లింపులను ఏజెన్సీకి అప్పగించడానికి సభ్యులు ఆమోదించారు. గతంలో ఇదే అంశాన్ని తిరస్కరించామని, మళ్లీ ఎలా ప్రతిపాదించారని సభ్యులు ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, కార్మిక సంఘాల లేఖలతో ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు అధికారులు సమాధానమిచ్చారు.
* టేబుల్ అజెండాగా రెండు అంశాలను ప్రతిపాదించగా, వాటిని సభ్యులు అంగీకరించారు.
* ఎండాడలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కొలనును అభివృద్ధి చేయడానికి రూ.43లక్షలు విడుదల చేయడానికి సభ్యులు అంగీకరించారు.
* అర్హత కలిగిన 18 మంది ట్యాక్స్ కలెక్టర్లు, ఆఫీసు సబార్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి సభ్యులు అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి