logo

నర్సీపట్నం ‘పుర’ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

నర్సీపట్నం పురపాలక సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ఏకగీవ్రమైంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్నికకు తెదేపా, జనసేన కౌన్సిలర్లు హాజరుకాలేదు.

Published : 09 Jun 2023 05:45 IST

తెదేపా, జనసేన కౌన్సిలర్ల గైర్హాజరు

ఛైర్‌పర్సన్‌గా సుబ్బలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌గా రామకృష్ణలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఆర్డీఓ జయరాం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: నర్సీపట్నం పురపాలక సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ఏకగీవ్రమైంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్నికకు తెదేపా, జనసేన కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌, వైకాపా కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌గా బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌గా కోనేరు రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పురపాలక సంఘంలో వైకాపాకు 14 మంది, తెదేపాకు 12 మంది, జనసేనకు ఒకరు, ఇండిపెండెంట్‌ ఒకరుండగా.. తెదేపా, జనసేన నుంచి 13 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ చెక్కా బాలమ్మ వైకాపాకు మద్దతు ప్రకటించడం, కోరం 16 మంది సరిపోవడంతో ఆర్డీఓ జయరామ్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఛైరపర్సన్‌గా బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌ కోనేటి రామకృష్ణ పేర్లను ప్రతిపాదించారు. పోటీలేక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక సజావుగా సాగేలా కౌన్సిలర్లు సహకరించారని ఎమ్మెల్యే గణేష్‌ పేర్కొన్నారు. గతంలో నిర్ణయించినట్లు రెండేళ్ల ఒప్పందం ప్రకారం.. ఛైర్‌పర్సన్‌గా ఆదిలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌గా నర్సింహమూర్తి తమ పదవులకు రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారన్నారు. నూతన ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం రెండేళ్ల తర్వాత తాను రాజీనామా చేయడంతోపాటు కౌన్సిలర్‌ బాలమ్మ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేలా సహకరిస్తానని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని