గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి
గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున సూచించారు.
కలెక్టర్ మల్లికార్జున
మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.మల్లికార్జున. చిత్రంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, గంగవరం పోర్టు సలహాదారు సాంబశివరావు, తదితరులు
వన్‌టౌన్, న్యూస్‌టుడే : గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, గంగవరం పోర్టు కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్య ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. కార్మికులు, కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై యాజమాన్యం నుంచి వివరణను కలెక్టర్ తెలుసుకున్నారు. పోర్టులో పనిచేస్తున్న వారంతా శాశ్వత ఉద్యోగులేనని, గంగవరం పోర్టు లిమిటెడ్, గంగవరం పోర్టు సర్వీసెస్ ఉద్యోగులను ఒకే విధంగా పరిగణిస్తామన్నారు. కార్మికులకు అందిస్తున్న ప్రత్యేక అలవెన్సును రెట్టింపు చేయాలని, కార్మికుల విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని సాంకేతిక విద్యార్హతలున్న కార్మికులకు స్కిల్ డెవలప్‌మెంట్ పోగ్రామ్ నిర్వహించి వారికి అదనంగా రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. తొలగించిన కార్మికులనుంచి వివరణ తీసుకొని వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బేసిక్‌పే పెంపు అనే అంశం ప్రభుత్వం తీసుకోవల్సిన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని కలెక్టర్ తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. పోర్టు, సర్వీసెస్ ఉద్యోగులను ఒకే విధంగా పరిగణించాలన్నారు. కార్యక్రమంలో పోర్టు ఈడీ జీజే రావు, సీనియర్ సలహాదారు సాంబశివరావు, సీఈఓ బీజీ గాంధీ, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కోన తాతారావు, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఐసీ జనరల్ మేనేజర్ గణపతి, డీసీఓ సునీత, డీసీపీ ఆనంద్‌రెడ్డి, కార్మికుల తరఫున నొల్లి తాతారావు, మాత అప్పారావు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్