సెస్ బకాయిలు తక్షణమే జమ చేయాలి
ఒక శాతం సెస్ బకాయిలను తక్షణమే భవన నిర్మాణ కార్మిక నిధికి జమ చేయాలని స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలను జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.మల్లికార్జున
వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఒక శాతం సెస్ బకాయిలను తక్షణమే భవన నిర్మాణ కార్మిక నిధికి జమ చేయాలని స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలను జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో సెస్ వసూళ్ల సహా వివిధ అంశాలపై ఆయన చర్చించారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం జారీ చేసిన 14 నోటీసుల ద్వారా 1శాతం సెస్ బకాయిలు రూ.160కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ మొత్తంలో రూ.11కోట్ల వరకు కార్మికశాఖ అధికారులు వసూలు చేశారని, మిగిలిన రూ.149 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇందులో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.79కోట్లు ఉన్నాయని చెప్పారు. విశాఖ జిల్లాలో 52,530 మంది అసంఘటిత రంగ కార్మికులు వైఎస్‌ఆర్ బీమా కింద పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కార్మికులను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి బీమా పథకాన్ని వర్తింప చేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పథకం కింద 5,74,912 మంది పేర్లు నమోదు చేయవల్సి ఉండగా, ఇంత వరకు కార్మికశాఖ అధికారులు 3,07,912 మందిని నమోదు చేశారన్నారు. మిగిలిన వారి పేర్లు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ సునీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు