logo

అమిత్‌షా పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

నగరంలో ఈ నెల 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన, బహిరంగ సభకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ శుక్రవారం సమీక్షించారు.

Published : 10 Jun 2023 03:26 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: నగరంలో ఈ నెల 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన, బహిరంగ సభకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ శుక్రవారం సమీక్షించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతానికి చేరుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అమిత్‌షా పర్యటించే ఐఎన్‌ఎస్‌ డేగా, ఎయిర్‌పోర్టు, వాల్తేరు రైల్వే మైదానం, ఆయన బస చేయనున్న పోర్టు అతిథిగృహం, వుడా చిల్డ్రన్‌ థియేటర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. బహిరంగ సభకు పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హోం మంత్రి పర్యటన సజావుగా సాగేందుకు పటిష్ట బందోబస్తు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీపీలు విద్యాసాగర్‌    నాయుడు, ఆనందరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని