logo

మా బొజ్జ గణపయ్య.. మమ్మేల రావయ్యా!

వినాయక చవితి పురస్కరించుకుని ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారిణి చింతల లావణ్య సూక్మ వినాయక బొమ్మను తయారు చేశారు.

Updated : 18 Sep 2023 05:24 IST

గోరుపై గణనాథుడు

వినాయక చవితి పురస్కరించుకుని ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారిణి చింతల లావణ్య సూక్మ వినాయక బొమ్మను తయారు చేశారు. అంగుళం ఎత్తు పరిమాణంలో అంకుడు కర్రతో బొమ్మ తయారు చేసి ప్రకృతి సిద్ధమైన రంగులు వేశారు. గోరుమీద నిలబడేలా నెలరోజుల పాటు శ్రమించి ఈ బొమ్మను తయారుచేశానని లావణ్య చెప్పారు.

న్యూస్‌టుడే, ఎలమంచిలి

రావికమతం, న్యూస్‌టుడే: వినాయక ఉత్సవాల్లో భాగంగా రావికమతం మండలం కొత్తకోటలో ఈ ఏడాది 30 అడుగుల భారీ మట్టి గణపయ్య విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని శివాలయం వీధిలో ఏర్పాటు చేయనున్నట్లు సిద్ధి వినాయక యూత్‌ ఉత్సవ కమిటీ పేర్కొంది. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు వీలుగా మట్టితో విగ్రహాన్ని తయారు చేయించామని కమిటీ ప్రతినిధి గట్టా శివ చెప్పారు. కొత్తకోటకు చెందిన విగ్రహ శిల్పి నక్కా రాజు, కోల్‌కతా నుంచి నలుగురు కళాకారులు రెండు నెలలపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారులు గణపతి రూపాలను వినూత్నంగా తీర్చిదిద్దారు. ఓ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్‌పై 12 మిల్లీ మీటర్ల వెడల్పు, 4 మిల్లీ మీటర్ల ఎత్తుతో పవళింపు రూపంలో స్వామి రూపాన్ని మలిచాడు. మరో సూక్ష్మ కళాకారుడు ఏక చెక్కపై బొజ్జ గణపతి రూపాన్ని మలిచాడు. మూడు అంగుళాల ఎత్తు, రెండు అంగుళాల వెడల్పుతో దీన్ని తయారు చేశారు.

 న్యూస్‌టుడే, నక్కపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని