logo

రైలు ఢీకొని డ్రైవర్‌ మృతి

మేహాద్రి రిజర్వాయర్‌ కింది కాలువలో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను చూడడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా రైలు ఢీకొని డ్రైవర్‌ మృతి చెందాడు

Published : 22 Sep 2023 05:14 IST

సంజీవి (పాతచిత్రం)

వేపగుంట, న్యూస్‌టుడే: మేహాద్రి రిజర్వాయర్‌ కింది కాలువలో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను చూడడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా రైలు ఢీకొని డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేహాద్రి రిజర్వాయర్‌కు దగ్గరలో నివాసముంటున్న సంజీవి(35) ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం వాహనంలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతనికి భార్య లక్ష్మీప్రసన్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవి బుధవారం రాత్రి వినాయక విగ్రహాల నిమజ్జనాలను చూసేందుకు రిజర్వాయర్‌ వైపు రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఇంటికొచ్చే సమయంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా పెందుర్తి నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసుకు సమాచారం అందడంతో జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు ఆదేశాల మేరకు హెచ్‌సీ భాస్కరరాజు సంఘటనా స్థలికి వెళ్లి వివరాలను సేకరించారు. ట్రాక్‌పై ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి గురువారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని