logo

4 వేల లీటర్ల పెట్రోల్‌ నేలపాలు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) టెర్మినల్‌ విశాఖ ఫిల్లింగ్‌ ప్లాంట్‌లో గురువారం మోటారు స్పిరిట్‌(ఎంఎస్‌-పెట్రోల్‌) పైపు పగిలి 4 వేల లీటర్ల వరకు వృథా అయింది

Published : 22 Sep 2023 05:22 IST

ఐఓసీ టెర్మినల్‌లో పగిలిన ఫిల్లింగ్‌ పైప్‌

సింధియా, న్యూస్‌టుడే : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) టెర్మినల్‌ విశాఖ ఫిల్లింగ్‌ ప్లాంట్‌లో గురువారం మోటారు స్పిరిట్‌(ఎంఎస్‌-పెట్రోల్‌) పైపు పగిలి 4 వేల లీటర్ల వరకు వృథా అయింది. ఆ వివరాలు... ఉదయం 10.30 గంటల సమయంలో టెర్మినల్‌లో లోడింగ్‌ కోసం ఆయిల్‌ ట్యాంకర్‌ ర్యాంపులోకి వెళ్లింది. ట్యాంకర్‌లో 4 కేఎల్‌ ఛాంబర్‌ నిండిన తర్వాత వాల్వు కట్టాలి. అలా వాల్వు కట్టేలోపు ట్యాంకర్‌ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్యాంకర్‌లోకి మోటారు స్పిరిట్‌ సరఫరా చేస్తున్న పైపు ఒక్కసారిగా పగిలి, పెట్రోల్‌ ఎగజిమ్మింది. దీంతో ఆ ఇంధనం పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌ డ్రైవర్‌ ఆరీఫ్‌(50)పై పడడంతో తడిసి ముద్దయ్యాడు. అధికారులు మెయిన్‌ ట్యాంకు వద్ద ఎంఎస్‌ బ్లాక్‌ వాల్వు మూసేసి, ఆరీఫ్‌కు అక్కడే స్నానం చేయించారు. ఇంతలో అతడి శరీరమంతా ఎర్రటి దద్దుర్లు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు లోడింగ్‌ నిలిపేసి, ఆ తర్వాత పునఃప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు