logo

ఆన్‌లైన్‌ ఓపీ విధానం..రద్దుకు డిమాండ్‌

కేజీహెచ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ఓపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

Updated : 22 Sep 2023 06:02 IST

కేజీహెచ్‌ పరిపాలన భవనం వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ఓపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. అభా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఓపీ తీసుకొనే విధానాన్ని ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆసుపత్రి పరిపాలన విభాగం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ ఆన్‌లైన్‌ విధానం వల్ల చదువు లేని, గ్రామీణ ప్రాంత రోగులు ఓపీ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన వైద్యం పొందాలనుకునే రోగులకు ఆన్‌లైన్‌ కష్టాలు తప్పడం లేదని ఆరోపించారు. సాధారణ విధానంలో కూడా ఓపీలను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో సీపీఐ నాయకులు ఎ.విమల, కె.సత్యనారాయణ, ఎస్‌కే రెహమాన్‌, జి.రాంబాబు, ఆర్‌.శ్రీనివాసరావు, పి.చంద్రశేఖర్‌, సీఎన్‌ క్షేత్రపాల్‌, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని