logo

ఆరు లారీలు సీజ్‌

అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న ఆరు లారీలు సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి బుధవారం రాత్రి గ్రావెల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీలను రెవెన్యూ సిబ్బంది నిలుపు చేశారు.

Published : 22 Sep 2023 05:33 IST

స్వాధీనం చేసుకున్న లారీలు

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న ఆరు లారీలు సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి బుధవారం రాత్రి గ్రావెల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీలను రెవెన్యూ సిబ్బంది నిలుపు చేశారు. గ్రావెల్‌ తరలింపునకు బిల్లులు చూపాలని కోరగా, డ్రైవర్లు సమాధానం ఇవ్వకపోవడంతో వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కశింకోట నుంచి ఎస్‌.రాయవరం అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం గనుల శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని