logo

అధికారికంగా గురజాడ జయంతి నిర్వహించాలి

మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని  నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌, ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు కోరారు.

Published : 22 Sep 2023 05:35 IST

ఆచార్య ముర్రు డిమాండ్‌

గురజాడ విగ్రహానికి నివాళుర్పించిన ఆచార్య ముత్యాలనాయుడు తదితరులు

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని  నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌, ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు కోరారు. గురజాడ జయంతి సందర్భంగా గురువారం ఇక్కడి కళాక్షేత్రంలోని విగ్రహానికి ముర్రు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురజాడ వంటి మహానుభావుడు ఇక్కడ పుట్టడం అదృష్టమని తెలిపారు. ఆయన రచించిన నాటకాలు, దేశభక్తి గీతాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. గురజాడ ప్రపంచ స్థాయి రచయిత అన్నారు. గురజాడ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కర్రి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి కందుల వెంకటేశ్వరరావు, కొణతాల శ్రీనివాసరావు, లక్కోజు ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని