logo

మంత్రి కనుసన్నల్లో రెస్కోలో భారీ అవినీతి

మంత్రి అమర్‌నాథ్‌ కనుసన్నల్లో ఆర్‌ఈసీఎస్‌లో రూ. వందల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పి.వి.ఎస్‌.ఎన్‌.రాజు డిమాండ్‌ చేశారు.

Updated : 22 Sep 2023 06:01 IST

జేసీకి జనసేన నాయకుల ఫిర్యాదు

జేసీ జాహ్నవికి వినతిపత్రం ఇస్తున్న చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రాజు, జనసేన నాయకులు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: మంత్రి అమర్‌నాథ్‌ కనుసన్నల్లో ఆర్‌ఈసీఎస్‌లో రూ. వందల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పి.వి.ఎస్‌.ఎన్‌.రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం సంయుక్త కలెక్టర్‌ జాహ్నవిని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. గతంలో దీనిపై జరిగిన విచారణ నివేదికలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఆర్‌ఈసీఎస్‌ పాలకవర్గ ఛైర్మన్‌గా పనిచేసిన బొడ్డేడ ప్రసాద్‌, కొంత మంది అధికారులతో కలసి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కుటుంబ సభ్యులు కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నియామక ప్రక్రియ చేపట్టారన్నారు. కొంత మంది ఉద్యోగులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఈపీడీసీఎల్‌ సీఎండీని కలసి ఫిర్యాదు చేశామన్నారు. విద్యుత్తు పరికరాలు కొనుగోళ్లు, బిల్లులు, జీతాలు చెల్లింపులు.. ఇలా ప్రతిదానిలో అవినీతి చోటు చేసుకుందన్నారు. ఆర్‌ఈసీఎస్‌ డిపాజిట్లను కాజేశారన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి నాయకులు తాడి రామకృష్ణ, భరణికాన రాము, దూలం గోపి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు