logo

గళమెత్తిన గురువులు

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగేళ్లయినా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి.

Published : 24 Sep 2023 04:11 IST

సీపీఎస్‌ రద్దు కోరుతూ నిరసనలు

పెందుర్తి రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో నాయకులు

పెందుర్తి, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగేళ్లయినా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. జీపీఎస్‌కు వ్యతిరేకంగా శనివారం ఫ్యాప్టో, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసనలు తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేయకపోగా జీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకోవడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కో-ఛైర్మన్‌ చందోలు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కొటాన శ్రీనివాసరావు, ధర్మారెడ్డి, రామకృష్ణ, మడ్డు శ్రీను, నాగేశ్వరరావు, గూడూరు శివ, బండారు దేముడుబాబు, తదితరులు పాల్గొన్నారు. తొలుత పెందుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

జీపీఎస్‌ను అంగీకరించేది లేదు..: జీపీఎస్‌ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల జాత శనివారం పెందుర్తిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నాయకులు పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.లక్ష్మీపతిరాజు, రెడ్డి మోహన్‌రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వర్‌, ఎం.రామకృష్ణ, చుక్కా సత్యం, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని