logo

బౌద్ధ స్తూపాలను పరిరక్షించాలి

శంకరం బొజ్జన్న కొండను రాష్ట్ర బుద్ధిస్ట్‌ సొసైటీ సభ్యులు శనివారం సందర్శించారు. సొసైటీ అధ్యక్షులు ఎ.హరిబాబు కొండ పైభాగంలోని ప్రధాన గుహ వద్ద ప్రార్థనలు చేశారు.

Published : 24 Sep 2023 04:11 IST

బొజ్జన్న కొండను సందర్శించిన బుద్ధిస్ట్‌ సొసైటీ సభ్యులు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: శంకరం బొజ్జన్న కొండను రాష్ట్ర బుద్ధిస్ట్‌ సొసైటీ సభ్యులు శనివారం సందర్శించారు. సొసైటీ అధ్యక్షులు ఎ.హరిబాబు కొండ పైభాగంలోని ప్రధాన గుహ వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం లింగాల కొండను, పురాతన బౌద్ధ విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ అభివృద్ధికి ఎంపీ చొరవ ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అన్ని రకాల  సౌకర్యాలు కల్పించాలన్నారు. బౌద్ధ విగ్రహాలు, స్తూపాలను పరిరక్షించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి దుర్గారావు, సిద్ధార్థ సోషల్‌ సర్వీసు కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నాగభూషణం, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని