logo

కటిక నేల..పేద రోగుల పానుపు

విశాఖ నగరం అల్లిపురానికి చెందిన అప్పారావు అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరారు. శనివారం రక్త పరీక్షలు చేయడానికి వార్డుబాయ్‌ ఆయన్ను మరో వార్డుకు తీసుకొచ్చాడు.

Published : 24 Sep 2023 04:11 IST

విశాఖ నగరం అల్లిపురానికి చెందిన అప్పారావు అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరారు. శనివారం రక్త పరీక్షలు చేయడానికి వార్డుబాయ్‌ ఆయన్ను మరో వార్డుకు తీసుకొచ్చాడు. అక్కడ కూర్చోబెట్టి వెళ్లి పోయాడు. వీల్‌ఛైర్‌ లేకపోవడంతో అప్పారావు కింద కూర్చోలేక నేలపై వాలిపోయారు. సుమారు గంటపాటు అలాగే పడుకుని ఉన్నా వీల్‌ఛైర్‌తో సిబ్బంది రాలేదని భార్య వాపోయారు. అప్పారావును పరామర్శించేందుకు వచ్చిన పక్కింటివారు అతను నేలపై పడి ఉండటం చూసి ఆవేదన చెందారు. ఇంతలో వైద్యురాలు వచ్చి చెప్పడంతో వార్డుబాయ్స్‌ వీల్‌ఛైర్‌ తీసుకొచ్చి వార్డుకు తరలించారు. సిబ్బంది చేతిలో డబ్బులు పెడితేనే వీల్‌ఛైర్‌ తీసుకొస్తున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌ను వివరణ కోరగా ఆసుపత్రిలోని వార్డులకు 45 వీల్‌ఛైర్లు అందజేశామన్నారు. మరో 50 వరకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొందరు రోగుల బంధువులు వీల్‌ఛైర్‌లను రోడ్డుపైకి తీసుకెళ్లిపోతున్నారని చెప్పారు.    

ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని