logo

లక్ష్యం దిశగా దృష్టిపెట్టాలి

ఉద్యోగాల కోసం చదువుతున్న నిరుద్యోగులు లక్ష్యం దిశగా దృష్టి పెట్టాలని రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ -2 కె.వీర మణికాంత్‌ అన్నారు.

Published : 24 Sep 2023 04:11 IST

మాట్లాడుతున్న కె.వీర మణికాంత్‌

సీతంపేట, న్యూస్‌టుడే : ఉద్యోగాల కోసం చదువుతున్న నిరుద్యోగులు లక్ష్యం దిశగా దృష్టి పెట్టాలని రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ -2 కె.వీర మణికాంత్‌ అన్నారు. శ్రీనగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఆయనకు గ్రంథాలయ కార్యదర్శి డి.ఎస్‌.వర్మ గ్రంథాలయంలో అన్ని విభాగాలు చూపించారు. గ్రంథాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉందన్నారు. అనంతరం ఆయన ఉద్యోగార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా చదవాలన్నారు.  సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎ.ప్రసన్న కుమార్‌, గ్రంథాలయ ఉపాధ్యక్షులు టి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు