logo

యువకుడికి దేహశుద్ధి

మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం సాయంత్రం గోపాలపట్నంలో చోటు చేసుకుంది.

Published : 24 Sep 2023 04:11 IST

గోపాలపట్నం, న్యూస్‌టుడే : మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం సాయంత్రం గోపాలపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు... 89వ వార్డు చంద్రనగర్‌కు చెందిన టి.చిన్ని(40)అనే మహిళ సింహాచలం రైల్వేస్టేషన్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే మాటు వేసి ఉన్న దినేష్‌(29) ఆమె మెడలో బంగారు నల్లపూసల తాడు లాక్కుని పాతగోపాలపట్నం వైపు పరారయ్యాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. గొలుసు స్వాధీనం చేసుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రహ్లాదపురానికి చెందిన నిందితుడు ఓ వస్త్రదుకాణంలో పని చేస్తున్నాడు. క్రైం ఎస్సై నరసింగరాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు