కలెక్టర్‌ కాలేకపోయా.. పెళ్లి చేసుకున్నా..!

బాగా చదివి కలెక్టర్‌ కావాలనుకున్నా.. కానీ రోడ్లు, మరుగుదొడ్లు లేకపోవడం, బస్సులు రాని గ్రామం నుంచి వేరే ఊరికి చదివేందుకు వెళ్లాల్సి రావడంతో కల నెరవేర్చుకోలేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు జయంత్‌ విగ్‌ ముందు ఓ గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణుల వసతిగృహాల్లో అందుతున్న సేవలపై ఆరా తీసేందుకు మంగళవారం

Updated : 15 Sep 2021 08:54 IST

● నీతి ఆయోగ్‌ సభ్యుడి ముందు గర్భిణి ఆవేదన


వివరాలు తెలుసుకుంటున్న జయంత్‌ విగ్‌

సాలూరు, న్యూస్‌టుడే: బాగా చదివి కలెక్టర్‌ కావాలనుకున్నా.. కానీ రోడ్లు, మరుగుదొడ్లు లేకపోవడం, బస్సులు రాని గ్రామం నుంచి వేరే ఊరికి చదివేందుకు వెళ్లాల్సి రావడంతో కల నెరవేర్చుకోలేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు జయంత్‌ విగ్‌ ముందు ఓ గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణుల వసతిగృహాల్లో అందుతున్న సేవలపై ఆరా తీసేందుకు మంగళవారం సాలూరులోని మహిళా వసతి గృహానికి వచ్చిన ఆయన పలువురితో మాట్లాడారు. ఈ సందర్భంగా మక్కువ మండలం చప్పబుచ్చంపేటకు చెందిన సోముల శోభను ప్రశ్నించగా ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. మరి పుట్టబోయే బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు అని అడగ్గా.. వేరే ప్రాంతానికి వలస వెళ్లి డాక్టరు చదివిస్తామని ఆమె తెలియజేశారు. అనంతరం అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. రెండు కాన్పుల మధ్య ఉండాల్సిన సమయం, మందులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారా అని అడిగారు. లేదని కొందరు, కల్పిస్తున్నారని మరి కొందరు తెలియజేశారు. పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై పలు సూచనలు చేశారు. ప్రణాళిక శాఖ అధికారి రామానుజాచార్యులు, ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో తిరుమల ప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీవో కామాక్షి, నీడ్‌ వేణుగోపాల్‌, ప్రశాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని