logo
Published : 29/11/2021 05:21 IST

ఫులే భావాలు ఆదర్శనీయం

జ్యోతిరావు విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

గంటస్తంభం: సమాజంలో సాంఘిక అసమానతలు లేకుండా జ్యోతిరావు ఫులే ఎంతో కృషిచేశారని, ఆయన భావాలు ఆదర్శనీయమని కలెక్టర్‌ సూర్యకుమారి కొనియాడారు. ఫులే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌ కూడలి వద్దనున్న ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నివర్గాలవారికీ చదువు అందాలని ఫులే పోరాడారన్నారు. బీసీ విద్యార్థుల కోసం త్వరలో బీసీ స్టడీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బీసీ సంక్షేమాధికారిణి డి.కీర్తి, డీఆర్‌డీఏ పీడీ అశోక్‌కుమార్‌, వ్యవసాయశాఖ జేడీ రామారావు, ఉపకలెక్టర్‌ పద్మావతి, బీసీ సంఘాల ప్రతినిధులు ఎం.మధు, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని