logo
Published : 29/11/2021 05:21 IST

కచ్చితమైన ఓటర్ల జాబితా లక్ష్యం

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌దండే

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటుహక్కు కల్పించాలని ఓటర్ల నమోదు పరిశీలకుడు కాంతిలాల్‌దండే రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. తుదిముద్రణ నాటికి నూరుశాతం కచ్చితమైన ఓటర్ల జాబితా తయారు కావాలన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం వివిధ రాజకీయపార్టీలు, ఎన్నికల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అర్హులను ఓటర్లుగా చేర్పించాలని, మరణించిన వారిపేర్లను తొలగించాలన్నారు. జనాభా, ఓటర్ల నిష్పత్తి ప్రాతిపదికగా నియోజకవర్గం, మండలం, పోలింగ్‌ స్టేషన్ల వారీగా పరిశీలించాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుదిజాబితా ప్రచురిస్తామని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. జేసీలు కిశోర్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, సబ్‌ కలెక్టర్‌ భావన, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీఆర్వో గణపతిరావు, ఆర్డీవో భవానీశంకర్‌ పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని