logo
Published : 29/11/2021 05:21 IST

రాష్ట్రాభివృద్ధి శూన్యం: కాంగ్రెస్‌

సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్‌

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి లేదని, ఆ పార్టీ నాయకులంతా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ జనజాగరణ యాత్రలో భాగంగా ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన డీసీసీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల అప్పులు చేయడం దారుణమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనే జగన్‌మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్‌ మృతులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండు చేశారు. డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు సుంకరి సతీష్‌, పీసీసీ జనరల్‌ కార్యదర్శులు బొట్టు శ్రీను, జమ్ము ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని