logo
Published : 29/11/2021 05:21 IST

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత

ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: నగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 23వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన విద్యార్థి సంఘ నాయకుడు అభిమన్యు, ఉపాధ్యాయ ఉద్యమనేత కె.శేషగిరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, పాకలపాటి రఘువర్మ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు తప్పవన్నారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండు చేశారు. దేశ భవిత విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రజల బాధ్యతను యువత తమ భుజాలపై వేసుకొని ముందుకెళ్లాలని, అప్పుడే మెరుగైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. ఎయిడెడ్‌ను ఎత్తివేయడం తగదని, విరమించుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌, అఖిలభారత అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.సాను, మయూక్‌ బిశ్వాస్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎ.అశోక్‌, టి.నాగరాజు, కేంద్ర కమిటీ సభ్యురాలు చిన్నారి, బాలికల కమిటీ కన్వీనరు బి.నాగూర్‌, కో-కన్వీనరు సి.హెచ్‌.పావని, డీఎస్‌ఎంఎస్‌ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎస్‌.అప్పలనాయుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.హెచ్‌.వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని