logo
Published : 29/11/2021 05:21 IST

అధ్వాన వనాలు

ఇది నగరంలోని బాబామెట్ట హౌసింగ్‌ కాలనీ పార్కు. దీన్ని 2006లో రూ.17.50 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసి అప్పటి రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖా మంత్రి బొత్స చేతులమీదుగా ప్రారంభించారు. ఇటీవల ఆక్రమణకు గురైంది. కొంత స్థలానికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు.

జిల్లాలోని పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో ఉద్యానాలు అధ్వానంగా మారాయి. ఏళ్లుగా అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరంలో కొన్నిచోట్ల ఆక్రమణకు కూడా గురయ్యాయి. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, బొబ్బిలి, సాలూరు, బెలగాం, నెల్లిమర్ల

విజయనగరం..: నగరపాలక సంస్థ పరిధిలో 32 వరకు ఉద్యానాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 14వ ఆర్థిక సంఘ నిధులతో ప్రహరీలు కట్టినప్పటికీ కొన్ని అభివృద్ధికి నోచుకోలేదు. కొన్ని పార్కులు ఆక్రమణలబారిన పడ్డాయి. ఈక్రమంలో వీటి అభివృద్ధిలో భాగంగా స్థానిక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఒప్పందాలు చేసుకునేందుకు నగరపాలిక అడుగులు కదుపుతోంది.

సాలూరు: ఇక్కడ పార్కుల అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. రామా కాలనీ, వెంకటేశ్వరకాలనీ, శ్రీనివాసనగర్‌, గాంధీ, రాజేశ్వరరావు పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. గుత్తేదారులు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.

బొబ్బిలి: బొబ్బిలిలో రెండు పార్కులున్నాయి. రాణిమల్లమ్మదేవి పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. యుద్ధస్తంభం వద్ద ఉన్న ఉద్యానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ కాటేజ్‌, షెడ్లు నిర్మించినప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి.

పార్వతీపురం పట్టణంలో రెండు పార్కులు, నెల్లిమర్లలోని గాంధీనగర్‌ కాలనీలో ఉన్న రెండు పార్కులదీ ఇదే దుస్థితి.

కమిషనర్ల మాట: విజయనగరంలో 14వ ఆర్థిక సంఘ, అమృత్‌ నిధులతో పార్కులను అభివృద్ధి చేశామని కమిషనరు ఎస్‌ఎస్‌.వర్మ తెలిపారు. నిధుల లభ్యత ఆధారంగా మిగిలినవి చేస్తామన్నారు. ● అభివృద్ధి పనులకు 14వ ఆర్థిక సంఘ నిధులు కేటాయించామని, టెండర్లు పూర్తయితే పనులు చేపడతామని సాలూరు కమిషనరు బి.రామసుబ్బారావు చెప్పారు. ● రెండు ఉద్యానాల అభివృద్ధికి ప్రతిపాదనలు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని బొబ్బిలి కమిషనరు ఎస్‌.శ్రీనివాసరావు వెల్లడించారు. ● కౌన్సిల్‌లో పెట్టి పనులు చేయిస్తామని పార్వతీపురం కమిషనరు పి.సింహాచలం పేర్కొన్నారు. ● రెండు పార్కుల అభివృద్ధికి టెండర్లు పిలిచినా, ఎవరూ ముందుకు రాలేదని, మరోసారి టెండర్లు పిలుస్తామని నెల్లిమర్ల కమిషనరు పి.కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని