logo
Published : 29/11/2021 05:21 IST

గర్భిణులకు ఆసరా

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరే వరకూ ప్రతి ఖర్చునూ ప్రభుత్వం భరిస్తుంది. జిల్లాలో ఎంతమంది ఇలా లబ్ధి పొందారు...? వైఎస్‌ఆర్‌ కింద బాధితులకు కలిగే ప్రయోజనాలేంటి..?, అత్యవసర సేవలు అవసరమైతే ఎవర్ని సంప్రదించాలి..? తదితర వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు సమన్వయకర్త యు.అప్పలరాజు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆయన మాటల్లోనే...

సేవలెలా పొందాలంటే: ఆరోగ్య శ్రీ సేవలు పొందాలంటే తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే. 2,436 వ్యాధులకు చికిత్స ఉంది. ఏడాదికి ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. కుటుంబానికి 12 ఎకరాల సాగు, లేకుంటే 35 ఎకరాల బీడు భూమి, లేదా సాగు, బీడు భూమి కలిపి 35 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు. రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన ఇతర ప్రభుత్వ ఉద్యోగులూ లబ్ధిపొందవచ్ఛు

ఖాతా తప్పనిసరి.. లబ్ధిదారులు ఇచ్చే బ్యాంకు ఖాతా మనుగడలో ఉండాలి. తొలుత ఎక్కడైనా బ్యాంకు ఖాతా తెరిస్తే ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఒక్కోసారి అందులోనే డబ్బులు జమవుతాయి. కొంతమంది ప్రసవ సమయానికి వేరే బ్యాంకు ఖాతా ఇస్తారు. దీనివల్ల అందులో వెతికితే కనిపించవు. డబ్బులు పడకపోతే ఆరోగ్య మిత్రలను కలిసి వినతులు అందిస్తే వారు చూసి పరిశీలిస్తారు. 99 శాతం అందరికీ డబ్బులు జమవుతున్నాయి.

వివరాలడగాలి: ఆరోగ్యశ్రీ కార్డుతో నెట్‌వర్క్‌ ప్రతినిధులను కలిస్తే ఆయా వ్యాధుల పరిస్థితి...వాటికి లబ్ధి వర్తిస్తుందా..? లేదా..? అడిగితే చెబుతారు. కానీ, చాలా మంది అవగాహన లేక ప్రభుత్వ ఫలాలను అందుకోలేకపోతున్నారు. మా ప్రతినిధి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబితే ...కచ్చితంగా ఆ వ్యాధి బాధితుడికి డబ్బులు వచ్చేలా చేస్తారు. ఇందులో మరో వాదన లేదు. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావొచ్ఛు 8333814058, 97, 98, 21 నంబర్లలో సంప్రదించొచ్ఛు

ఆర్థిక సాయం అందజేత: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు మూడో నెల టీకాలు పూర్తయ్యే వరకూ విడతల వారీగా రూ.6 వేలను ప్రధానమంత్రి మాతృత్వ వందన కింద అందిస్తారు. ఇది తొలి కాన్పు వారికి మాత్రమే వర్తిస్తుంది. వైఎస్‌ఆర్‌ ఆసరాకు, దీనికి సంబంధం లేదు. ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరి డిశ్ఛార్జి అయితే వైఎస్‌ఆర్‌ ఆసరా పేరిట రోజుకు రూ.225లు చెల్లిస్తారు. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, శస్త్రచికిత్సకు రూ.3 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. నెట్‌వర్కు ఆసుపత్రులు ఉన్నచోట చేరితేనే ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 13 ప్రైవేటు, 14 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలు కూడా మా పరిధిలోకి వచ్చాయి. కచ్చితంగా నెట్‌వర్క్‌ మిత్రలను కలిసి వారి వద్ద పేర్లు నమోదు చేసుకొని, వారడిగిన సమాచారం ఇవ్వాలి.

1536 వ్యాధులకు చోటు: వైఎస్‌ఆర్‌ ఆసరాలో భాగంగా 1,536 వ్యాధులకు స్థానం కల్పించారు. ఇందులోనే గర్భిణులను కూడా చేర్చారు. కేవలం ప్రసవం మాత్రమే కాకుండా, చిన్నారులకు అనారోగ్యం, మహిళలకు ఇతరత్రా సమస్యలు ఎదురైనా దీని ద్వారా చికిత్స పొందొచ్ఛు గుండె సంబంధిత వ్యాధులున్న వారికి రూ.60 వేల వరకూ రాయితీ ఇచ్చే వెసులుబాటు ఉంది.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని