logo
Published : 29/11/2021 05:21 IST

వల విల

చిరిగిన వలలు సరిచేసుకుంటున్న మత్స్యకారులు

భోగాపురం, న్యూస్‌టుడే: నిర్ణయించిన హద్దులు దాటారంటూ నాలుగు రోజుల కిందట శ్రీకాకుళం సమీపంలో రెండు బోట్లపై వేట సాగిస్తున్న వారిపై అక్కడి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. వారు ఇక్కడికొచ్చి వేట సాగించడమే గాకుండా సముద్రంలో వదిలిన భారీ ఇంజిన్లు, వలల్ని పాడు చేసి వెళ్తున్నారని ఉన్నతాధికారులకు స్థానిక మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఇరు ప్రాంతాల వారు వారి పరిధుల్లోనే మత్స్యవేట చేసుకోవాలని...ఇతరులకు ఇబ్బందులు పెడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అధికారులు అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.

నిబంధనలు ఇలా..: ఎనిమిది కిలోమీటర్ల లోపు తెడ్డును ఉపయోగించే పడవలు, చిన్న ఇంజిన్లు ఉన్న పడవలతో మాత్రమే వేటకు వెళ్లాలి. అంతకుమించితే ఫైబర్‌, ట్రాలర్‌ బోట్లు ద్వారా చేయాలి.

ఇతర ప్రాంతాల వారూ...: విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు చెన్నైకి చెందిన వారు ట్రావెల్‌ బోట్లతో జిల్లాలోని తీర ప్రాంతంలోకి వస్తున్నారని, చిన్న పడవల ద్వారా వెళ్లిన తమకు చేపలు లభించక ఇబ్బందులు పడుతున్నామని, వలలు తెగిపోయి ఆర్థికంగా నష్టపోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. కనీసం వలలు తెగిన వాటికైనా నష్టపరిహారం ఇప్పించకపోవడం బాధాకరమని వాపోతున్నారు.

పూర్తిగా నష్టపోతున్నారు: వేట సాగిస్తున్న సమయంలో పెదకొండ్రాజుపాలెం సమీపంలో విశాఖకు చెందిన పలువురు బోట్లుతో వచ్చి స్థానిక మత్స్యకారుల వలలను తెంపడమే కాకుండా దౌర్జన్యానికి దిగారు. ఈ విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురవ్వలేదు. మళ్లీ నాలుగైదు రోజుల నుంచి ఇతర ప్రాంతాల వారి బోట్లు ఇక్కడికి వస్తున్నాయి. వలలు కూడా పాడవుతున్నాయి.  - మైలపల్లి అచ్చన్న, మత్స్యకారుడు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: మత్స్యశాఖ నిబంధనల ప్రకారం 8 కి.మీ. తర్వాత మాత్రమే యంత్రాలతో నడిచే పడవల ద్వారా వేటాడాలి. దీన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవు. ఇలా ఎవరైనా చేస్తే మా దృష్టికి తీసుకు వస్తే పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డీడీ●

జిల్లాలో సముద్ర తీరం: 29 కిలో మీటర్లు

తీర ప్రాంత గ్రామాలు: 16

మత్స్యకార జనాభా : 27వేలు

వేటపై ఆధారడిన కుటుంబాలు: 5900

సంప్రదాయ పడవలు : 357

తెడ్డు పడవలు: 555

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని