logo
Published : 29/11/2021 05:21 IST

30న జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు

జాతీయ స్థాయికి ఇద్దరి ప్రాజెక్టుల ఎంపిక

ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైన రక్షిత

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించి, వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా నిర్వహిస్తున్న 29వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌-2021 పోటీలు ఈ నెల 30న విజయనగరం పూల్‌బాగ్‌లోని గురజాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మండలి, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శిక్షణ మండలి సంయుక్తంగా పోటీలు నిర్వహిస్తాయి.

175 ప్రాజెక్టుల నమోదు: విజ్ఞానశాస్త్రం అంశంగా ప్రాజెక్టులు రూపొందించాలని వివరాలను ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు పంపించారు. జిల్లాలో సుమారు 130 పాఠశాలల నుంచి ఆరు నుంచి పదోతరగతి చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొననున్నారు. 175 ప్రాజెక్టులు నమోదు చేశారని అధికారులు వెల్లడించారు. వీటిలో 10-13 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసే అవకాశముంది. గతేడాది జిల్లాలో 120 నమోదు చేస్తే పది ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రస్థాయి పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. నెల్లిమర్ల మండలం జర్జాపుపేట జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని వై.రక్షిత రూపొందించిన సోలార్‌ శానిటైజేషన్‌, జామి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని షేక్‌ జుబేదా రూపొందించిన ‘స్మార్ట్‌ అంబులెన్స్‌ విత్‌ రోప్‌ వే’ ప్రాజెక్టులు జాతీయస్థాయికి అర్హత సాధించాయి.

అంశాలివే..

ప్రధానమైనది: - సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞానశాస్త్రం

ఉప అంశాలు: సుస్థిరమైన జీవనం కోసం పర్యావరణ వ్యవస్థ, అనువైన సాంకేతికత, సామాజిక ఆవిష్కరణ,రూపకల్పనాలు-నమూనాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థ.

ఇచ్చిన అంశంపై ప్రాజెక్టు నిర్వహించి, నివేదిక తయారు చేసుకోవాలి. నాలుగు చార్టులు, లాగ్‌బుక్‌, ప్రాజెక్టు నివేదికలతో పోటీలకు హాజరు కావాలి. ఇతర వివరాలకు 9491570507 నంబరును సంప్రదించాలి. మాన్యువల్‌ విధానంలో పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. - బల్లా శ్రీనివాసరావు, జిల్లా సైన్స్‌ సమన్వయకర్త

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని