logo
Published : 29/11/2021 05:21 IST

అంచనాలు మారాయి

సగంలో ఆగిపోయిన గోముఖి అక్విడెక్టు పనులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: అధికారుల తాత్సారం, గుత్తేదార్ల నిర్లక్ష్యం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం... ఇలా పలు కారణాలతో కొన్ని కీలక పనులు ఏళ్లుగా బొబ్బిలి నీటిపారుదల సర్కిల్‌ పరిధిలో ఆగిపోయాయి. ధరలు పెరగడంతో కొత్తగా టెండర్లు పిలవాలంటే అంచనాలను సవరించాలి. దీంతో రూ.కోట్లలోనే ప్రభుత్వానికి భారం కానుంది. అదనపు భారం మోస్తే గానీ కదలిక వచ్చేలా లేదు.

మక్కువ మండలం ఎడమ కాలువ పరిధిలో గోముఖి అక్విడెక్ట్‌ పరిధి 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. పిల్లర్లు కోతకు గురికావడంతో గిట్టుబాటు కాదని మధ్యలో గుత్తేదారు వదిలేశారు. ఇప్పుడు అంచనాలు పెంచి టెండర్లు పిలిస్తే అదనంగా రూ. 8 కోట్ల నిధులు అవసరమవ్వడంతో ప్రభుత్వ నిర్ణయానికి అంతా ఎదురు చూస్తున్నారు. ● 5,500 ఎకరాలకు సంబంధించిన అదనపు ఆయకట్టు పనులు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో గుత్తేదారు మధ్యలో ఆపేశారు. మరో గుత్తేదారుకు పనులు అప్పగించాలంటే మారిన రేట్ల ప్రకారం ఇవ్వాలి. దీంతో అదనంగా కావాల్సిన రూ.4 కోట్ల నిధులు ఇప్పించాలని అధికారులు దస్త్రాలను సిద్ధం చేశారు. ● కంచరగెడ్డ జలాశయం పనులు నిర్వాసితులకు చెల్లింపులు జరగక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. కాలువలు తవ్వాలి. మట్టికట్టకు మరమ్మతులు చేయాలి. అదనంగా రూ.2 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు.

తాజావి రూపొందించాం: సర్కిల్‌ పరిధిలోని దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తికి ఎంతమేరకు నిధులు అవసరమో అంచనాలు రూపొందించాం. ఉన్నతాధికారులకు ఆయా దస్త్రాలను నివేదించాం. నిధులు విడుదల చేస్తే కొత్తగా టెండర్లు పిలిచి ఏజెన్సీలకు అప్పగిస్తాం. అప్పుడే ఆయకట్టు మేరకు సాగునీరు అందుతుంది. - ఎన్‌.రాంబాబు, ఎస్‌ఈ, బొబ్బిలి సర్కిల్‌.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని