Published : 01 Dec 2021 06:09 IST
జాగ్రత్తలతోనే మాతృమరణాలకు అడ్డుకట్ట
కలెక్టరేట్, న్యూస్టుడే: గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గమనించి, ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. డెంగీ, మలేరియా వల్ల మాతృమరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో మాతాశిశు మరణాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు. వివిధ కారణాలతో ఆరుగురు చనిపోయారని డీఎంహెచ్వో రమణకుమారి, అదనపు డీఎంహెచ్వో రామ్మోహన్రావు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని, సుమారు మూడు లక్షల మందికి ఇంకా టీకాలు వేయాల్సి ఉందన్నారు. డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags :