logo
Published : 01 Dec 2021 06:09 IST

57,720 మందికి విద్యాదీవెన


చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలో 57,720 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. 2020-21 విద్యా సంవత్సరానికి మూడో విడత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.29.71 కోట్లను దూరదృశ్య సమావేశం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య, రాజన్నదొర, కడుబండి శ్రీనివాసరావు, జేసీ (ఆసరా) వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని జేఎన్‌టీయూను గురజాడ విశ్వవిద్యాలయంగా మార్చుతున్నామని సీఎం చెప్పగా.. మహాకవి వర్ధంతి రోజున వెల్లడించడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని