Published : 01 Dec 2021 06:09 IST
ఉత్కంఠగా బిహార్ ట్రోఫీ టోర్నమెంట్
విద్యా ప్రకాష్ జైస్వాల్
ఆయూష్ జిమారే
విజయనగరం క్రీడలు, న్యూస్టుడే: బీసీసీఐ, అండర్-19 కుచ్ బిహార్ ట్రోఫీ టోర్నమెంట్ ఉత్కంఠ భరిత వాతావరణంలో కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం పీవీజీ రాజు స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో ముంబయి-పుదుచ్చేరి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పుదుచ్చేరి ఫీల్డింగ్ ఎంచుకొంది. ముంబయి జట్టు 147.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 645 పరుగులు చేసింది. ఇందులో ఆయూష్ జిమారే 163 బంతులకు 133 పరుగులు, విద్యా ప్రకాష్ జైస్వాల్ 192 బంతులకు 102 పరుగులు, జాష్ 203 బంతులకు 114, సౌరభ్ సింగ్ 195 బంతులకు 103 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టు 23.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. పోటీదారును అధిగమించేందుకు ఇంకా 585 పరుగులు చేయాల్సి ఉంది.
Tags :