logo
Published : 01/12/2021 06:09 IST

రాష్ట్రస్థాయికి 13 ప్రాజెక్టుల ఎంపిక


విద్యార్థులతో అధికారులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు మంగళవారం విజయనగరంలోని చలపతి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిర్వహించారు. ‘సుస్థిరమైన జీవనానికి విజ్ఞానం’ అనే అంశంపై 209 ప్రాజెక్టులు రాగా ఇందులో 13 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు ఎం.జ్యోతికుమారి విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఇన్‌ఛార్జి డీఈవో బ్రహ్మాజీరావు, ఎంఈవో రాజు, జిల్లా సైన్స్‌ సమన్వయకర్త బి.శ్రీనివాసరావు, అకడమిక్‌ సమన్వయకర్త ఎ.భానుప్రకాష్‌ పాల్గొన్నారు.

ఎంపికైంది వీరే..:

1.కె.స్పందన- జడ్పీహెచ్‌ఎస్‌, జిన్నాం(సుస్థిర వ్యవసాయం). 2.పి.పవన్‌కుమార్‌- జడ్పీహెచ్‌ఎస్‌, గరుగుబిల్లి(సేంద్రియ సేద్యం). 3.పి.షన్ముఖవర్ధన్‌- ఏపీఎంఎస్‌, భోగాపురం(పాఠశాలలో చెత్త నిర్వహణ). 4.ఆర్‌.లావణ్య- బీసీ సంక్షేమ గురుకులం, కొత్తవలస(జీవసంచులు). 5.డి.శిరీష- జడ్పీహెచ్‌ఎస్‌, ఎస్‌.కోట(జల సంరక్షణ పరికరం). 6.ఆర్‌.పార్థసారథి- జడ్పీహెచ్‌ఎస్‌, కోనూరు(వర్షపు నీటినిల్వ). 7.పి.అనూరాధ- జీజీహెచ్‌ఎస్‌, బెలగాం(సేంద్రియ ఎరువుల తయారీ). 8.కె.వెన్నెల- జడ్పీహెచ్‌ఎస్‌, జరజాపుపేట(మూగ చెవిటి వ్యక్తులకు మార్గదర్శిని). 9.డి.హరి- జడ్పీహెచ్‌ఎస్‌, బిళ్లలవలస(వ్యవసాయ ఘంటికలు). 10.కె.గణేష్‌- జడ్పీహెచ్‌ఎస్‌, దేవాడ(వృత్తాకార పద్ధతిలో పోషకాహార సాగు). 11.సీహెచ్‌.తేజస్విని- శ్రీ చలపతి పాఠశాల, విజయనగరం(సంప్రదాయ పద్ధతిలో మూత్రపిండాల చికిత్స). 12.డి.షర్మిల- జడ్పీహెచ్‌ఎస్‌, కుమిలి(కోడిగుడ్డు కర్పరాలు భారం కాదు.. వరమే). 13.ఎస్‌.మధు- జడ్పీహెచ్‌ఎస్‌, గుంకలాం(నులిపురుగుల నిర్మూలన పద్ధతి).

ప్రాజెక్టును వివరిస్తున్న విద్యార్థిని

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని