logo
Published : 01/12/2021 06:09 IST

బడికి బెంగ లేదాయె

నల్లబోర్డు బాగు చేస్తున్న దృశ్యం

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే జిల్లాలోని పాఠశాలల్లో నల్లబోర్డులకు రంగులు వేయడానికి, ఇతర చిన్నపాటి పనులకు నిధులు మంజూరు కాక ఇన్నాళ్లు ఉపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి నుంచి బయట పడినట్లే. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన పాఠశాల నిర్వహణ నిధులను మంజూరు చేసింది.

జిల్లాలో 2,759 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు కాంపోజిట్‌ నిధులు 2021-22 విద్యా సంవత్సరానికి గాను రూ.6.94 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని విద్యుత్తు బిల్లులు, మరుగుదొడ్లు నిర్వహణ, మరమ్మతులతో పాటు ఇతర సామగ్రి కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుంది. విద్యాశాఖ 1-30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేలు, 30-100 మంది ఉంటే రూ.25 వేలు, 100-250 మందికి రూ.50 వేలు, 250-1000 మంది విద్యార్థులున్న చోట రూ.75 వేల చొప్పున కేటాయించింది. జిల్లాలో ప్రాథమిక స్థాయి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న బడుల్లో 1-30 విద్యార్థులున్నవి 1283, 30-100 మధ్యలో 884, 100-250 మధ్య 175 ఉండగా, 250-1000 మంది విద్యార్థులున్న పాఠశాల ఒకటి ఉంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి గల విద్యాసంస్థల్లో 1-30 మంది ఉన్నవి ఒకటి, 30-100 మధ్యలో 100 ఉండగా.. 100-250 మధ్య 158 పాఠశాలలు, 250-1000 మధ్య 222 ఉండగా, 1000 మంది దాటినవి మూడు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటికి కేటాయించిన నిధులను అవసరాల మేరకు వినియోగించాల్సి ఉంటుందని విజయనగరం జిల్లా ఎస్‌ఎస్‌ఏ పథక సంచాలకుడు స్వామినాయుడు తెలిపారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని